అబ్బ తూచ్ అంటూ రివర్స్ గేర్ వేసిన నిర్మాత ఎస్‌కేఎన్.. వీడియో రిలీజ్

సినిమా అయినా.. రాజకీయం అయినా .. లేదా ఏ రంగం లోని ప్రముఖులైన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం ముఖ్యం. కానీ ఇటీవల పరిస్థితులను గమనిస్తే.. ఏదో ఒకటి అనేయడం.. ఆ తర్వాత అలా అనలేదు అంటూ వీడియో రిలీజ్ చేయడం లేదా ఆ విషయంపై మళ్లీ క్లారిటీ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు ప్రముఖ తెలుగు నిర్మాత. తెలుగు ప్రేక్షకులకు నిర్మాత ఎస్‌కేఎన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన నిర్మించే సినిమాల కంటే కూడా స్టేజీపై చేసే కామెంట్స్ ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తెలుగు హీరోయిన్లపై ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఈ క్రమంలోనే నిర్మాత కామెంట్స్ పై సోషల్ మీడియా లోనూ, మీడియా లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత ఎస్‌కేఎన్‌ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడాను. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగమ్మాయిలను పరిచయం నిర్మాతల్లో తాను కూడా ఉన్నానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. కానీ నేను తెలుగు అమ్మాయిలతో పని చేయనని రాశారు.

producer skn clarity on comments made by him at dragon event

కానీ చాలా మంది తెలుగు నటీమణులను పరిశ్రమకు పరిచయం చేసిన కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారని నేనే పరిచయం చేశా. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశానని అన్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగువారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాదాన్యతగా భావిస్తానని స్పష్టం చేశారు. అందుకే దయచేసి తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు ఏమన్నారంటే..

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమా ఈవెంట్లో ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.. తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దో మాకు తెలిసి వచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే సపోర్ట్ చేయాలని నేను, సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాం అంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+