అల్లు అర్జున్‌కు షాక్.. 'పుష్ప-2' సినిమా మొత్తం యూట్యూబ్‌లో ప్రత్యక్షం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. 'పుష్ప 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. అలాగే అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించినట్లు పేర్కొన్నాయి. హిందీలో కూడా ఈ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రనే అత్యంతవేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిని సినిమాగా 'పుష్ప 2'రికార్డు సృష్టించింది.

'పుష్ప 2' జోరు చూస్తుంటే ఈజీగా రూ.1500 కోట్లు రాబట్టడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 'పుష్ప 2' సినిమాకు ఊహించని షాక్ తగిలింది. సినిమా మొత్తం కూడా యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయింది. యూట్యూబ్‌లో హెచ్‌డీ ప్రింట్ కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది సినిమాకి గట్టి దెబ్బ అనే చెప్పాలి.అయితే ఇది హిందీ వర్షన్ మాత్రమే కావడం విశేషం. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న 'పుష్ప 2'ఆన్‌లైన్‌లో సినిమా లీక్ కావడం పెద్ద దెబ్బగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications