మూడోస్థానానికి పడిపోయిన 'పుష్ప2'
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2. అల్లు అర్జున్, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించారు. ఐదోతేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇంతవేగంగా ఏ సినిమా కూడా వెయ్యి కోట్లరూపాయలను అందుకోలేదు. బాహుబలి2, కేజీఎఫ్, కల్కి సినిమాల రికార్డులను బద్దలు కొట్టేసింది. తెలుగులోకన్నా హిందీలోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. సినిమా విడుదలైనప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వస్తోంది.
ట్రెండింగ్ లో నిలిచిన నాగబాబు
ఇటువంటి తరుణంలో నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారనే వార్త అధికారికంగా ప్రకటించారు. దీంతో నాగబాబుకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో నిలిచాయి. నాగబాబు గతంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును విమర్శించిన పాత వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాజ్యసభకు ఎంపికైనవారు కూడా ట్రెండింగ్ లో నిలిచారు. మొత్తానికి నాగబాబుకు సంబంధించిన వార్త పుష్ప2ను వెనక్కి నెట్టింది. మొదటి స్థానంలో నాగబాబు, రెండోస్థానంలో పుష్ప2 నిలిచాయి.

మోహన్ బాబుపై ప్రజల దృష్టి
అయితే అనుకోకుండా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలపై ప్రజల దృష్టి మళ్లింది. మూడు రోజుల నుంచి ఎక్కడా విరామం లేకుండా అనేక ట్విస్టులనిస్తూ ఈ వివాదం మలుపులు తిరుగుతూ వస్తోంది. మొదటి నుంచి మోహన్ బాబుకు మనోజ్ తో ఉన్న గొడవలు, రెండో పెళ్లి చేసుకోవడంపై నచ్చకపోవడంలాంటి కారణాలన్నీ కలిపి ఆస్తుల పంపకాల మధ్య తేడా వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్ కు అన్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు. సొంత ఇంటి గేటు బయటే మనోజ్ ను లోపలికి వెళ్లనివ్వకుండా వాచ్ మెన్ అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా ప్రేక్షకులు చూశారు. ఇటువంటి తరుణంలో మోహన్ బాబు పెదరాయుడిలా వ్యవహరించి కొడుకులిద్దరికీ సమానమైన తీర్పు ఇవ్వడంతోపాటు సమానంగా ఆదరించాలని కోరుతున్నారు. ఈ సంఘటనతో నాగబాబు, పుష్ప2 విషయాలు వెనక్కి వెళ్లిపోయాయి. మోహన్ బాబు గొడవ మొదటి స్థానంలో, నాగబాబు విషయం రెండో స్థానంలో నిలవగా, పుష్ప2 మూడోస్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications