'ప్రసాద్ ఐమ్యాక్స్'తో అల్లు అర్జున్‌కు గొడవేంటి?
హైదరాబాద్ లో తొలి మల్టీప్లెక్స్ అవడమే కాకుండా అతి పెద్ద స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్ కూడా ప్రసాద్ ఐమ్యాక్సే. సినీ ప్రియులంతా తమ అభిమాన హీరో సినిమాను చూడాలంటే తొలిరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే టికెట్ బుక్ చేసుకుంటారు. అందులో నాణ్యత అలా ఉంటుంది. క్యాంటిన్ లో ఉండే తినుబండారాల ధరలు కూడా చాలా తక్కువ. అందుకే అందరూ ప్రసాద్ ఐమ్యాక్స్ కే మొదటి ఓటు వేస్తారు. అటువంటి పెద్ద స్క్రీన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప2 చూడాలని అభిమానులంతా ఆశించారు. కానీ వారి ఆశ నిరాశైంది. ప్రసాద్ లో వారు పుష్ప2ను చూడలేకపోయారు. దీనికి కారణం ఈ సినిమా నిర్మాతలకు, ప్రసాద్ ఐమ్యాక్స్ కు పర్సంటేజ్ దగ్గర తేడా రావడమే.
ప్రసాద్ 52.5 శాతం చెల్లిస్తుంది
సాధారణంగా ప్రసాద్ ఐమ్యాక్స్ తమ మల్టీప్లెక్స్ లో సినిమా వేయాలంటే టికెట్ ఆదాయంలో పన్నులు పోగా మిగిలిన ఆదాయంలో 47.5 శాతం తాను ఉంచుకొని డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు మిగిలిన 52.5 శాతాన్ని చెల్లిస్తుంది. అయితే పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థలు మాత్రం పన్నులు పోగా మిగిలిన ఆదాయంలో 45 శాతం తాము ఉంచుకొని మిగిలిన 55 శాతాన్ని డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తుంది. ఇక్కడే మైత్రీ మూవీ మేకర్స్ పట్టుబట్టింది. తమకు 55 శాతం ఇవ్వాల్సిందేనని భీష్మించింది. లేదంటే సినిమా ఇవ్వమని చెప్పారు. దీంతో తాము కూడా సినిమా వేయమని ప్రసాద్ ఐమ్యాక్స్ చెప్పేసింది. వీరిద్దరూ ఇలా పట్టుబట్టడంతో పుష్ప2ను ప్రసాద్ ఐమ్యాక్స్ లో అభిమానులు చూడలేకపోయారు.

ప్రతిరోజు రూ.కోటి గ్రాస్ నష్టం
దీనివల్ల ప్రతిరోజు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు గ్రాస్ ను మైత్రీ మూవీస్ నష్టపోయింది. తాము 47.5 శాతం ఉంచుకొని మిగతాది చెల్లిస్తుంటే ఇతర మల్టీప్లెక్స్ లు అలా చెల్లించడమేంటంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ను ప్రసాద్ ఐమ్యాక్స్ ఆశ్రయించింది. దీంతో చర్చలు ప్రారంభమయ్యాయి. పీవీఆర్, ఐనాక్స్ కూడా 52.5 శాతం చెల్లించాలని అక్కడ తీర్మానిస్తే మైత్రీ మూవీస్ చిక్కుల్లో పడుతుంది. వచ్చిన ఆదాయంలో నుంచి కొంత తిరిగి వాటికి చెల్లించాల్సి ఉంది. పుష్ప2 సినిమాకు కాబట్టి గట్టిగా పట్టుబట్టారుకానీ తర్వాత నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా నిర్మాతలు అలాగే పట్టుబట్టే అవకాశం ఉండదు. అలా పట్టుబడితే వారికే నష్టం వస్తుంది. చివరకు ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
-
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications