Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్..? ఎట్టకేలకు ఓపెన్ అయిన పుష్ప నిర్మాత

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం... 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచియమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది.

ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది.
అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది.

pushpa-2 producer ravi shankar clarity on johnny master issue

యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాలుగు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అయితే జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే ప్రచారం జరిగింది. జానీ మాస్టర్ చేత బాధించపడ్డ బాధితురాలిగా అల్లు అర్జున్ అండగా నిలిచారు. తాను నటిస్తోన్న పుష్ప-2 సినిమాలో ఆఫర్ ఇవ్వడం జరిగింది. దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారని అంతా నమ్ముతున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు పుష్ప-2 సినిమా నిర్మాత రవిశంకర్. ఆయన మాట్లాడుతూ.. ఇది జానీ మాస్టర్, అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. ఆమె పుష్ప 2 సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్. ఆమెతో వర్క్ చేయించుకున్నాం. అలాగే జానీ మాస్టర్‌తో ఓ ఐటెమ్ సాంగ్ చేయించుకోవాల్సింది ఉంది. కానీ, ఈలోపే ఇలా జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్‌కు ఎటువంటి సంబంధం లేదని నిర్మాత రవిశంకర్ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+