పుష్ప2 విడుదల తేదీ ఖరారు.. సూపర్ డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప 2'తో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప 2' విడుదల తేదీని ప్రకటించింది. 2024 ఆగస్టు 15వ తేదీ నుంచి థియేటర్లలో రూల్ మొదలుపెట్టబోతున్నాడు. విడుదల తేదీ పోస్టర్‌ను ఈరోజు సోషల్ మీడియా ద్వారా మైత్రీమూవీస్ విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు థియేటర్లలోకి 'పుష్ప 2' అడుగుపెట్టడం ఖాయమైపోయింది.

2024 ఆగస్టు 15 గురువారం వచ్చింది. ఆరోజు ఎలాగూ సెలవు కాబట్టి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. తర్వాత వీకెండ్ అదిరిపోవడం ఖాయమంటున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం బాక్సాఫీసు మోత మోగిపోతుంది. సోమవారం రక్షాబంధన్ కావడంతో ఆరోజు కూడా సెలవు వస్తోంది. 5 రోజులు బాక్సాఫీసును దున్నేయవచ్చు. 'జవాన్' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. 'పుష్ప 2' కూడా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అభిమానులు సంబరంగా చెబుతున్నారు. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.












Click it and Unblock the Notifications