ఐఫోన్ విసిరికొట్టి పుష్ప2 షూటింగ్ నుంచి వెళ్లిపోయిన దర్శకుడు సుకుమార్?

దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి, ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఉత్కంఠతో ఎదురుచూసే సినిమాల్లో పుష్ప2 ఒకటి. పుష్ప1 అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగులోకన్నా హిందీలోనే పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. రెండోభాగంపై భారీ అంచనాలుండటతో హీరో, నిర్మాత, దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేసి, బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను చేస్తున్నారు.

కొన్ని సన్నివేశాల రీషూట్
ప్రతి సన్నివేశం బాగా రావాలనే తపనతో సుకుమార్ ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే సుకుమార్ పర్ఫెక్షన్ కోసం తపిస్తుండటమే. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది. దర్శకుడు సుకుమార్ తన ఐఫోన్ ను సెట్ లో కోపంతో బలంగా విసిరికొట్టారు. అంతేకాదు.. అక్కడినుంచి వెళ్లిపోయారు కూడా. చాలా సన్నివేశాలు సరిగా రాలేదనే ఉద్దేశంతో ఆయన రీషూట్ చేస్తున్నారు. అందులో భాగంగానో కీలకమైన సన్నివేశం ఎన్నిసార్లు తీసినా సరిగా రావడంలేదు.

pushpa2 director sukumar came out shooting set after breaking his iphone details here

నటులు సరిగా చేయడంలేదు..
రావడంలేదు అనేకన్నా నటులు సరిగా చేయడంలేదు. ఒకరు చేస్తే మరొకరు సరిగా చేయడంలేదు. అప్పటికే 40 టేకులు తీసుకున్నారు. అయినా నటులంతా అలాగే వ్యవహరిస్తుండటంతో సుకుమార్ కోపం కట్టలు తెంచుకొని ఫోన్ విసిరికొట్టి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం నుంచి వెళ్లిపోయారు. ఈ వార్త ఆంగ్ల పత్రికలో వచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వార్త వైరలవుతోంది. అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో తాను ఎంతో కష్టపడుతున్నప్పటికీ నటులు మాత్రం సహకరించడంలేదనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+