వచ్చే ఏడాది విడుదల కాబోతున్న పుష్ప2?

అల్లు అర్జున్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పుష్ప2 చిత్రం అతనికి అనేక కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాలో సన్నివేశాలు బాగా రాలేదని సుకుమార్ రీషూటింగ్ జరపడంతోపాటు పవన్ కల్యాణ్ అభిమానులతో బన్నీకి గొడవ జరగడంతో సినిమాను డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు. మూడు సంవత్సరాల సమయం దీనిమీదే వెచ్చిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తికాకపోతుండటంతో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

ఎడిటింగ్ తో సహా ఫస్ట్ హాఫ్ పూర్తి
చివరకు షూటింగ్ కు ప్యాకప్ చెప్పి, గడ్డం కూడా తీసేసి విదేశాలకు కుటుంబంతో సహా వెళ్లిపోయాడు. చివరకు నిర్మాతలు దర్శకుడికి, హీరోకు సయోధ్య కుదిర్చి ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సుకుమార్ ఎడిటింగ్ తో సహా సినిమాలోని ఫస్ట్ హాఫ్ ను పూర్తిచేశాడు. కీలక పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ డేట్లు దొరక్కపోతుండటం కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆయనకు సంబంధించిన షూటింగ్ భాగమే మిగిలివుంది. అయితే అతను బిజీగా ఉండటంతో అక్టోబరులోనైనా డేట్లు కేటాయించాలని నిర్మాత, దర్శకులు కోరుతున్నారు.

pushpa2 postponed once again due to director sukumar and hero allu arjun clashes

అక్టోబరు 20 నుంచైనా డేట్లు ఇవ్వమని
కనీసం అక్టోబరు 20వ తేదీనుంచైనా డేట్లు ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబరు నెలాఖరుకల్లా సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలనే డెడ్ లైన్ ను హీరో దర్శకుడికి పెట్టినట్లు సమాచారం. అప్పటికి షూటింగ్ మొత్తం పూర్తయితేనే అనుకున్నవిధంగా సినిమా డిసెంబరు ఆరోతేదీకి విడుదలవుతుంది.

అందులో ఒక్కరోజు ఆలస్యం జరిగినా సినిమా వచ్చేఏడాదికి వాయిదా పడినట్లే. ఇప్పటికే మూడు సంవత్సరాలకు పైగా సమయం గడిచిపోవడంతోపాటు అట్లీ, నెల్సన్ సినిమాలు తప్పిపోయాయి. సందీప్ వంగా వేరే ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. దీంతో తీవ్రమైన కోపంతో ఉన్న అల్లు అర్జున్ విధించిన డెడ్ లైన్ కు సినిమా విడుదల కావడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం ఐటం సాంగ్ తీయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఎన్నిరోజులు పడుతుందో సుకుమార్ కే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+