కౌన్ బనేగా కరోడ్ పతి షో లో పవర్‌స్టార్‌పై ప్రశ్న...ఆడియన్స్ పోల్‍కి వెళ్లిన కంటెస్టెంట్లు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు అభిమానుల్లో క్రేజ్ మాములుగా ఉండదు. ఇక, ఇటీవలే ఏపీ డిప్యూటి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆయనను తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా సోని టీవీలో ప్రసారమవుతున్న కౌన్‍బనేగా కరోడ్‍పతి 16 సీజన్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై ఓ ప్రశ్న వచ్చింది. ఇక, ఈ షోకు బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా వచ్చిన ఓ ఎపిసోడ్‌లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ దంపతులు కౌన్‌బనేగా కరోడ్‌పతి షోకు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సందర్భంగా వారికి రూ.1,60,000కు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న వచ్చింది. జూన్ 2024లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు ఎవరు? అని అమితాబ్ వారిని అడిగారు. ఈ ప్రశ్నలు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లు ఇచ్చారు. అయితే, ఆ దంపతులు ఈ క్వశ్చన్ కోసం లైఫ్‌లైన్ ఉపయోగించుకున్నారు. ఈ ప్రశ్నకు వారు ఆడియన్స్ పోల్‍ను ఎంపిక చేసుకున్నారు. అయితే, ఆడియెన్స్ లో 50శాతానికిపైగా పవన్ కల్యాణ్ అని పోల్ చేశారు. దీంతో వారు కూడా పవన్‌కళ్యాణ్ ఆప్షన్‌ను లాక్ చేశారు. దీంతో రూ.1,60,000 ప్రశ్నను వారు దాటారు. ప్రస్తుతం ఈ క్వశ్చన్‌కు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పవర్‌స్టార్ ఫ్యాన్స్ కాస్త ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్న పవర్‌స్టార్..
కౌన్‍బనేగా కరోడ్‌పతి సీజన్ 16 సోనీ టీవీలో ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ షోను వీక్షించొచ్చు. ఇక, ఈ సారి 16వ సీజన్ ఆగస్టు 12, 2024 న ప్రారంభమైంది. ఇప్పటికే 15 సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన సినిమాలను చాలానే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లలో పాల్గొననున్నట్లు సమాచారం. ముందుగా ఆయన ఓజీ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు పలు సినిమాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రంతో పాటు, హరిశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications