ధోనితో ఎఫైర్ నా జీవితంలో మాయని మచ్చ.. రేపు నా పిల్లలకు ఏం సమాధానం చెప్పాలి
రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు. ధోని సైతం పలువురు హీరోయిన్స్ డేటింగ్ చేశాడు.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఓ సౌత్ హీరోయిన్‌తో ధోని చాలా రోజులు రిలేషన్‌లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు లక్ష్మీ రాయ్.ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాంచనమాల కేబుల్ టీవి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి.
హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్‌లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోనీ తన పెళ్లికి ముందు లక్ష్మీరాయ్‌తో డేటింగ్‌లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో ధోనితో లక్ష్మీ రాయ్ తరచూగా కనిపించేవారు. ధోని టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోనీ లక్ష్మీ రాయ్ కలిసి హాజరవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయింది.
ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీరాయ్ ధోనీతో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా,లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నారు. అయితే లక్ష్మీరాయ్ గతంలో ఓ ఇంటర్య్వూలో ధోనితో రిలేషన్‌పై స్పందించారు.ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే.. నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications