పెళ్లి కాకుండానే తల్లైన రాశి ఖన్నా..?
టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు, అవుతున్నారు. హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైంది.
ఆ తర్వాత .జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియవు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు.

ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. అయితే బాలీవుడ్‌లో మాత్రం రాశి ఖాన్నా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అక్కడ వరుస సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ చిన్న పాపని ఎత్తుకొని ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఏంటీ రాశి ఖన్నా పెళ్లి కాకుండానే తల్లైందా అనే అనుమానం నెటిజన్లు వ్యక్తం చేశారు.
అయితే రాశి ఖన్నా మేనకోడలు ఫొటోలుని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.''నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబం చాలా అందంగా మారింది. మా లిటిల్ ప్రిన్సెస్. మాటల్లో చెప్పలేనంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను'' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మీలాగే క్యూట్, అండ్ బ్యూటిఫుల్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications