సెల్ఫీ కోసం వచ్చి.. స్టార్ హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని!(వీడియో)
కన్నడ నటి, డింపుల్ క్వీన్ రచిత రామ్ తన 34వ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల్లో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ప్రతి ఏడాది తన పుట్టిరోజు సందర్భంగా అభిమానులను నేరుగా కలుసుకుని వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగడం నటి రచిత రామ్‌కు చాలా ఇష్టం. ఈ ఏడాది కూడా భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆమె కొంత సేపు సరదాగా గడిపారు. కానీ ఓ అభిమాని చేసిన పని ఒక్కసారిగా ఆమెను షాక్ కు గురిచేసింది.
అసలేం జరిగిందంటే..?
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో ఈ చేదు అనుభవం ఎదురైంది. అభిమానులను కలుస్తున్న సమయంలో ఓ యువకుడు నటి వద్దకు వచ్చాడు. ముందుగా ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పటికీ.. ఆ యువకుడు ఒక్కసారిగా రచితా రామ్ రెండు బుగ్గలను చేతులతో పట్టుకుని గిల్లాడు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యారు. అభిమాని చేసిన ఈ అనుచిత చర్యకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున చుట్టుముట్టిన జనసందోహం మధ్యలో ఈ ఘటన జరగడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

నటి రచితా రామ్ మాత్రం ఈ ఘటనతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. అక్కడ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా సంయమనంతో వ్యవహరించారు. ఆ యువకుడు అలా బుగ్గలు గిల్లడంతో నటి కాస్త ఇబ్బంది పడగా.. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం రచితా రామ్ తనను తాను సర్దుకుని మిగిలిన అభిమానులతో ఫోటోలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వీడియో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
रचिता राम जो कि साउथ की actress है उनके साथ selfie लेने के बाद उनका यह फैन उनके गाल खीच लेता है जिससे वह बहुत असहज हो गई
— Sanju (@SanjuKu79832010) October 3, 2026
ये बहुत ही गलत व्यवहार है
किसी महिला की अनुमति के बिना आप उसको छू नहीं सकते
सोचो इतनी बड़ी actress पब्लिक के बीच सुरक्षित नहीं है तो बाकी ल़डकियों को कितना… pic.twitter.com/QjHKD8wF9F
అభిమానం పరిమితులు దాటడం సరైనదేనా?
సాధారణంగా అభిమానులు తమ అభిమాన నటీనటులను చూసినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురికావడం, ఉత్సాహం చూపించడం సహజమే. కానీ ఆ ఉత్సాహంలో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా భౌతికంగా దగ్గరవ్వడం, వారి వ్యక్తిగత పరిధిని దాటడం సరైనది కాదు. భారీగా జనం తరలివచ్చే ఇటువంటి బహిరంగ కార్యక్రమాల్లో తరచుగా అభిమానులు ఈ పరిమితులను మర్చిపోతుంటారు. హీరోయిన్లకు ఇలాంటి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. ఫ్యాన్ మీట్స్, మాల్ ప్రారంభోత్సవాలు, సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో పెద్ద ఎత్తున గుమిగూడే జనాల మధ్య వారు ఇలాంటి అనూహ్య ఘటనలను ఎదుర్కొంటూనే ఉన్నారు. గతంలో కూడా పలువురు కథానాయికలు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.














Click it and Unblock the Notifications
