'కూలీ' సినిమా కలిపింది ఇద్దరినీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు..!

ఏ హీరో అయినా నటుడు అయినా సూపర్ యాక్టింగ్ చేశారంటే దానికి కారణం డైరెక్టర్ దే. సాధారణంగా అందరు నటుల వద్ద టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ ను ఎంతవరకు పిండుకోవాలన్నది డైరెక్టర్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమాలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ కూడా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. మిగతా సినిమాల్లో అంత యాక్టింగ్ చేసినట్లు కనిపించరు. ఆ రేంజ్ లో డైరెక్టర్స్ కు మూవీపై లవ్ ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా మొదట తాను చేసి చూపించి ఆ తర్వాత యాక్టర్స్ ను చేయమంటారు. ఈ క్రమంలో చాలామంది డైరెక్టర్స్ కు నటులు కావాలని ఉంటుంది. మరికొంత మంది హీరోగానూ రాణించాలని ఆశగా ఉంటుంది. కానీ అనేక కారణాలతో వెనకడుగు వేస్తుంటారు.

మరికొన్ని సినిమాల్లో డైరెక్టర్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. కొన్ని సెకన్లు అయినా సినిమాలో కనిపించాలని భావిస్తుంటారు. అయితే తమిళ ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఒక్కటి కూడా ప్లాఫ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఆయన హీరో అవతారం ఎత్తనున్నారు. తనలోని నటనను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ గా మాత్రమే కాదు యాక్టర్ గానూ తాను సూపర్ అని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు.

లోకేశ్ కనగరాజ్ తాజాగా కూలీ మూవీతో వచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మిక్స్ టాక్స్ తోనే రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ మూవీ తర్వాత లోకేశ్ ఖైదీ-2 చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీయబోయే కొత్త చిత్రంతో లోకేశ్ కనగరాజ్ హీరోగా మారబోతున్నారట. ఇప్పటికే లోకేశ్.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Rachita Ram Shines as Kalyani in Coolie Set to Star Opposite Lokesh Kanagaraj

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కూలీ చిత్రంలో నటించిన రచిత రామ్‌ని ఎంపిక చేశారని టాక్. కూలీ మూవీలో ఈమె.. కల్యాణి అనే పాత్ర చేసింది. ఆమె విలక్షణమైన నటనకు మంచి క్రేజ్ వచ్చింది. కన్నడలో స్టార్ హీరోయిన్ రాణిస్తోంది రచిత. ఇప్పుడు లోకేశ్ సరసన హీరోయిన్‌ గా ఈమెనే తీసుకున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని టాక్. దీంతో నెటిజెన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇంకా మరిన్ని మంచి పాత్రలు చేయాలని విష్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+