ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్‌మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. అది ఓ తెరిచిన పుస్తకం లాంటిది. అక్కడ సన్మానాలు ఉంటాయి.. ఛీత్కారాలు ఉంటాయి. అవార్డులు, రివార్డులు ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ ఉంటుంది.. ప్రేమగా మాట్లాడే వాళ్లూ ఉంటారు. ఇలా అన్నీ కలిసిన రంగుల ప్రపంచమే సినిమా ఇండస్ట్రీ అని చెబుతుంటారు. అయితే ఇండస్ట్రీలో చాలా రకాల మనుషులు ఉంటారు. కొందరు వచ్చామా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామా.. అంతే వెళ్లిపోతారు. ఇంకొందరు తోటి నటీ నటులను ఇబ్బందికి గురి చేస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ హీరోయిన్ రాధా ప్రశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండాలంటే కమిట్మెంట్(సెక్స్) కి ఒప్పుకోవాల్సిందే
— Milagro Movies (@MilagroMovies) April 1, 2026
:- Radha pic.twitter.com/mnOI4GzfB4
" ఇండస్ట్రీలో కంపల్సరీ అది ఉండాలి. కమిట్మెంట్. అదే ఇప్పుడున్న భాషలో.. ఇండస్ట్రీలో అందరూ సోపు పెట్టి మెల్లగా అడిగేవాళ్లు ఉండరు. మేము ఇది ఇస్తాం. మాకు ఇది కావాలి అంతే.. కండిషనల్ గా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే..? ఒకవేళ ఇష్టం లేదు. నేను ముఖం సీరియస్ గా పెట్టి ఉండేదాన్ని తెలియదు.. ఇలా ఉండకూడదు. ఓకే సార్.. థ్యాంక్యూ సార్.. తప్పకుండా చూద్దాం సర్. షేక్ హాండ్ ఇవ్వాలి. మీకు ఇష్టం ఉండదు. కష్టంగానే ఉంటుంది. కానీ .. నీకు ఇబ్బంది ఉంటే అద్దం ముందు విజృంభించు. ఎస్వీఆర్ లెవెల్లో.. కానీ సెట్లో వద్దు. అక్కడ ఓకే సార్.. థ్యాంక్యూ సార్.. తప్పకుండా సర్.. అలాగే సర్.. చూద్దాం సర్.. అని నవ్వుతూ చెప్పాలి. నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం కాదు. నిజ జీవితంలో యాక్ట్ చేయాలి"

ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె మరో ఇంటర్య్వూలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇంతకు ముందూ ఉంది..ఇప్పుడు ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఇలాంటివి ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు. అయితే ఇప్పుడు రోడ్డు మీద ఎక్కారని కీలక కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications