క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి ఎంజాయ్ చేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది.
తాజాగా దీనిపై సీనియర్ నటి రాధిక సైతం రియాక్ట్ అయ్యారు. తన జీవితంలో ఎదురైన ఓ విచిత్రమైన సంఘటన గురించి ఆమె వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ..46 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి సమస్యలే మహిళలకు ఎదురవుతున్నాయి. తన జీవితంలో కూడా ఇలాంటి ఘటనే ఎదురైందని రాధిక చెప్పుకొచ్చారు. సినీ సెట్, క్యారవాన్లలో హిడెన్ కెమెరాలు పెట్టి, నటీమణుల ఫొటోలను తీసుకునే వారు. అక్కడి సిబ్బంది ఈ దృశ్యాలను పంచుకుని వారి మొబైల్ ఫోన్‌లలో చూస్తూ ఆనందించడం చూశానని చెప్పారు.

ఇది తనను చాలా భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. ఆ భయంతోనే లొకేషన్‌లో కారవాన్‌ను ఉపయోగించడం మానేశానని రాధిక వెల్లడించింది. అదే మా ప్రైవేట్ ప్లేస్. అక్కడే కదా మేము దుస్తులు మార్చుకోవడం, భోజనం చేయడం, రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తాము. అలాంటిది అక్కడ కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టడం దుర్మార్గమని రాధిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ సమంత కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో మహిళా నటీమణులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరారు.












Click it and Unblock the Notifications