ముద్దు సీనేగా.. ఇన్నర్ వేర్ లో చేయాలని ఆ డైరెక్టర్ అడిగాడు.. నటి రాధికా ఆప్టే షాకింగ్ రివీల్..
ప్రముఖ నటి రాధికా ఆప్టే మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ ఇలా అన్ని భాషల్లో చిత్రాలు చేసింది. తెలుగులో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో కీలక పాత్రలో మెరిచింది రాధికా ఆప్టే. అలాగే బాలకృష్ణ లయన్ సినిమాలోనూ నటించింది. ఇటీవల లస్ట్ స్టోరీస్ 3 లో పద్మ క్యారెక్టర్ తో మెప్పించింది. అయితే రాధికా ఆప్టే అనగానే చాలామందికి రొమాంటిక్స్ సీన్స్ గుర్తుకొస్తాయి. చాలా సినిమాల్లో ఆమె ఇంటిమేట్ సీన్స్ కు యూత్ లో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తనకు ఎదురైన కొన్ని విచిత్రమైన అనుభవాలను వెల్లడించింది రాధికా ఆప్టే.
తాను కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కొన్ని బోల్డ్ పాత్రల్లో నటించాల్సి వచ్చింది. అయితే దాని కారణంగా కథలో అవసరం లేకపోయినా కొందరు దర్శకులు, నిర్మాతలు తనను శృంగార సన్నివేశాల్లో నటించమని ఒత్తిడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో అవసరం లేకపోయినా ఓ 15 సెకన్ల ముద్దు సీన్ చేసేయండి అంటూ చాలా తేలికగా మాట్లాడుతుంటారని తెలిపింది. అంతేకాక ఓ యాక్షన్ సన్నివేశంలో ఇన్నర్ వేర్ లో నటించాల్సిందిగా తనను అడిగిన సందర్భాన్ని ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే వెల్లడించింది. అయితే యాక్షన్ సీన్ లో వేగంగా కదలాల్సి ఉంటుంది కాబట్టి అలా చేయడం కుదరదని చెప్పానని వివరించింది. అయినా చేయాల్సిందేనని పట్టుబట్టేవారని రాధికా ఆప్టే మండిపడింది.

కెరీర్ లో కొన్ని న్యూడ్ సినిమాల్లో నటించిన కారణంగా ఇలాంటి సన్నివేశాలకు తాను సులభంగా అంగీకరిస్తాననే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఏర్పడిందని తెలిపింది. ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో మహిళా నటీమణుల పట్ల ఉన్న మూస ధోరణి, దర్శక నిర్మాతలు వారిని చూసే కోణంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది. అలాగే 2016లో వచ్చిన పార్చ్ డ్ సినిమా వివాదంపై కూడా ఆమె స్పందించింది. ఆ సినిమాలో రాధికా ఆప్టే నటించిన ఓ న్యూడ్ సన్నివేశం లీకై నెట్టింట దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ లీకుల గురించి తాను అప్పట్లోనే భయపడలేదని, క్యారెక్టర్ డిమాండ్ మేరకే తాను ఆ సీన్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
