Raghunandana Song: హనుమాన్ రఘునందన పాట రిలీజ్..
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా విజయ ఢంకా మోగించింది. ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది మొదట గ్రాఫిక్స్ అయితే, రెండవది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. ఇక, హనుమాన్ సినిమాకు గౌరహరి మ్యూజిక్, పాటలు అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా ఈ సినిమాలో హైలెట్ అని చెప్పుకోవ్చు. ఇందులో ముఖ్యంగా రఘునందన రఘు రఘు నందన అనే పాట ఎంతో ప్రత్యేకం. తాజాగా హనుమాన్ మూవీ మేకర్స్ ఈ పాటను రిలీజ్ చేయడం జరిగింది.
రఘు రఘు నందన, రఘువర సేవన..రఘు పతి ఛాయాన..శత యోజన..శత శత యోజన..శరది నియోజన..శరపరి లంఘన లిరిక్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హనుమాన్ సినిమాలోని సెకండ్ హాఫ్లో హనుమంతుని శక్తుల గురించి విభీషణుడు వివరిస్తున్న సీన్లో ఈ పాట వస్తుంది. ఈ సాంగ్ ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకున్ని ఆకట్టుకుందనే చెప్పాలి. హనుమాన్ సినిమాలోని సెకండ్ హాఫ్‌లో విభీషణుడు చెప్పే ఒక్కో డైలాగ్కు వచ్చే ఒక్కో సీన్..ఆ సీన్‌లలో బీజీఎమ్గా వచ్చే రఘునందన సాంగ్ ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. ఈ పాట హనుమాన్ ఆడియో జ్యూక్ బాక్స్‌లో కూడా లేదు.

రూ. 40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా : ఈ పాట కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా టీమ్ ఈ పాటను రిలీజ్ చేశారు. రఘు రఘు నందన, రఘువర సేవన..రఘు పతి ఛాయాన..శత యోజన..శత శత యోజన..శరది నియోజన..శరపరి లంఘన లిరిక్స్‌తో పాటు పాటను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక, ప్రేకక్షులు ఈ పాటన ఫ్రీగా వినొచ్చు. అతి చిన్న సినిమాగా రిలీజయ్యి హనుమాన్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా అంచనాలకు మించి రూ. 330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక, ఈ సినిమా పార్ట్ 2 కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications