నిశ్చితార్థం అయిన రెండు రోజులకే హీరోయిన్ పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతుండగా, మరి కొందరు తమ బ్యాచ్‌లర్ జీవితానికి గుడ్ బై చెప్పి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా, తాజాగా మరో జంట పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
మార్చి 13న వీరిద్దరు నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. సడన్‌గా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరు షాక్‌కు గురయ్యారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తొలి సినిమా ''రాజావారు రాణి గారు'' సినిమాలో రహస్య గోరఖ్ హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే వీరిద్దరు అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనే వీరి బంధంపై అనేక వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేస్తూ.. తాము కేవలం స్నేహితులమే అంటూ తప్పించుకున్నారు. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే వీరి నిశ్చితార్థం చేసుకుని ఒకటయ్యారు. తాజాగా దీనిపై హీరోయిన్ రహస్య గోరఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.

''ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు, బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం , ప్రేమలో పడ్డాం, ఎన్నో ఊసులు చెప్పుకున్నాం , ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్‌కి వెళ్లాం, ఎన్నో సమస్యలు చూశాం, ఎట్టకేలకు మనది అద్భుతమైన జర్నీ , నీతో నా ప్రయాణాన్ని కొనసాగించేందుకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. నా సర్వస్వం కిరణ్ అబ్బవరం'' అంటూ తన పేజ్‌లో రాసుకొచ్చింది. రహస్య గోరఖ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !!












Click it and Unblock the Notifications