ప్రియుడు వద్దు..బిజినెస్‌మెన్‌‌ ముద్దు..స్టార్ హీరోయిన్ సంచలనం..?

బాలీవుడ్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికీ బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. ఆషికి 2 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్‌ సినిమాల్లోనే నటిస్తోంది.

ఇక అమ్మడుకు ఎఫైర్లు కూడా తక్కువేం కాదు. గతంలో ఆదిత్యరాయ్ కపూర్‌తో శ్రద్ధా కపూర్ రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత తన చిన్ననాటి మిత్రుడుని శ్రద్ధా కపూర్ ప్రేమిస్తోందని, అతన్నే వివాహం చేసుకుంటుందనుకున్నారు. ఈ రిలేషన్ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్‌తో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందనే రూమర్లు వినిపించాయి. ఇటీవల శ్రద్ధా కపూర్ రచయిత రాహుల్ మోడీతో రిలేషన్‌షిప్‌లో ఉందనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

rahul Mody Shraddha Kapoor breakup news viral

ఈ వార్తలకు బలం చేకూరుస్తు అమ్మడు షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. రాహుల్ మోడీతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ '' మనసు నీ దగ్గరే ఉంచుకో. కానీ నా నిద్రను మాత్రం తిరిగి ఇచ్చేయ్'' అనే క్యాప్షన్‌ను జత చేసింది. అంతేకాకుండా రాహుల్ మోడీని ట్యాగ్ చేసింది. దీంతో శ్రద్ధా కపూర్ రాహుల్ మోడీతో రిలేషన్‌లో ఉందని అంతా భావించారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ చేసుకుందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడిపోయినట్టు సమాచారం. ఇదే సమయంలో శ్రద్ధా కపూర్ ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+