సమంతతో దర్శకుడు డేటింగ్‌పై భార్య సంచలన పోస్ట్
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్య శ్యామాలికు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి ఆప్డేట్స్ ఇవ్వడం లేదు.

సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతికి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమె వెంటే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.
ఇలా సమంత , రాజు నిడుమోరు కలిసి తరచు దర్శనం ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.ఇదే సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన పోస్ట్ అప్పట్లో బాగానే నెట్టింట వైరల్‌గా అయింది.'మంచి కర్మను సృష్టించండి.. ప్రజలకు సాయం చేయండి..నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి' అనే కొటేషన్‌తో కూడిన ఉన్న ఫొటోను షేర్ చేసింది.
తాజాగా మరోసారి తన సోషల్ మీడియాలో మరో పోస్ట్‌ను షేర్ చేసింది దర్శకుడి భార్య. శ్యామలి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, "నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు" అనే అర్థం వచ్చేలా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ఈ పోస్ట్ తన భర్తను ఉద్దేశించి ఆమె పెట్టి ఉంటారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే రాజు నిడుమోరు భార్య శ్యామల ఇన్‌స్టాగ్రామ్‌ను ఓసారి పరిశీలిస్తే..2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫొటోలు కానీ, ఆయన సినిమా విషయాల గురించి కూడా ఆమె తన సోషల్ మీడియా ఎలాంటి ఆప్డేట్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమోరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజు నిడుమోరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications