రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్?
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. షూటింగ్ కు సమయం ఎక్కువగా ఉంటే ఈలోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని మహేష్ బాబు యోచిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రెమ్యునరేషన్ కు న్యాయం జరుగుతుంది : పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోయినప్పటికీ పాన్ ఇండియా హీరో రేంజ్ లోనే మహేష్ బాబు మార్కెట్ ఉంటుంది. సినిమా సినిమాకు నిర్మాతలే అతని రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు రూ.78 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు దీన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకు ఇచ్చిన రెమ్యునరేషన్ కు న్యాయం జరుగుతుందని, అతని మార్కెట్ ప్రకారం ఎంతిచ్చినా తక్కువే అనేవారు కూడా పరిశ్రమలో ఉన్నారు.

ఏడాదిన్నర కాల్షీట్లు : రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమాకు రూ.110 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి ఏడాదిన్నరకు పైగా కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే రెండు సినిమాలు చేసే సమయంలో ఒక సినిమానే చేయాల్సి వస్తుంది. అయితే అందుకు తగ్గట్లుగానే పారితోషికం ఉంటుందంటున్నారు. రాజమౌళి గత చిత్రాలకు పనిచేసిన హీరోలు కూడా అంతే. కాల్షీట్లు ఎక్కువగా కేటాయించాల్సి ఉండటంతో వాటికి తగ్గట్లుగానే ఆయా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ప్రస్తుతానికి రూ.110 కోట్లు తీసుకుంటున్నారా? లేదంటే అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నారా? అనే విషయం ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైతేకానీ స్పష్టత వచ్చేలా లేదు.












Click it and Unblock the Notifications