రజనీకాంత్ - రాజమౌళి కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్

రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడైనా సరే తమకు పిలుపు రాకపోతుందా? అనేదే వారి ఆశ. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు స్టార్ హీరోలు రాజమౌళి నుంచి అవకాశాలువ వస్తే వద్దనుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఎంతో బాధపడ్డారు. జీవితకాలంలో మళ్లీ అవకాశం వస్తుందో? రాదో? అనుకుంటున్నారు. అటువంటివారిలో చాలామంది ఉన్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి
ఈ కోవలోనే రజనీకాంత్ - రాజమౌళి కాంబినేషన్ లో రావాల్సిన ఓ సినిమా మిస్సయింది. కొన్నాళ్ల క్రితం రజనీకాంత్ తో సినిమా తీయాలని, తనను కలిసి రాజమౌళి కథ చెప్పారు. వెంటనే రజనీకాంత్ కూడా ఓకే చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్న సమయంలో దర్శకుడు శంకర్ రజనీకాంత్ ను కలిసి రాబో కథ చెప్పారు. ఈ సినిమాను అప్పటికే షారుక్ ఖాన్ కు చెప్పగా తిరస్కరించారు. కథ నచ్చడంతో రాజమౌళి సినిమాను పక్కనపెట్టిన రజనీకాంత్ రోబో సినిమాకు ఓకే చెప్పారు. దీంతో కొంత ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిన ఆ సినిమా ఆగిపోయింది. యువ హీరోలకు ధీటుగా సినిమాలు తీసుకుంటూ వెళుతున్న రజనీకాంత్ తో రాజమౌళి సినిమా తీసుంటే అది ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Rajamouli and Rajinikanth combination missed movie details

మహేష్ బాబుతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న రాజమౌళి
ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న రాజమౌళి దీనికి దాదాపు మూడు సంవత్సరాల సమయం కేటాయించనున్నారు. ఇది ఒక భాగమా? రెండు భాగాలా? అనే విషయమై చిత్ర యూనిట్ స్పష్టతనివ్వలేదు. రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. 73 సంవత్సరాల వయసులో కూడా ఎంతో నిబద్దతగా సినిమాల్లో నటిస్తున్నారు. రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు కేటాయించాలి. ఇప్పుడు సినిమా తీయాలనుకున్నా, మహేష్ బాబు సినిమా తర్వాత తీయాలనుకున్నా కుదిరేపని కాదు. ఎందుకంటే కనీసం ఆరు సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటికి రజనీకాంత్ కు 79 నుంచి 80 సంవత్సరాలు వస్తాయి. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే రాజమౌళి - రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం కనపడటంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+