ఇదేం ట్విస్ట్ భయ్యా : మహేష్ , రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే. ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్‌పై గురి పెట్టాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీరికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి కీలక ఆప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌ను రాజమౌళి ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌కు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారట.

త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 9న రాజమౌళి ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించి..కథకు సంబంధించిన విశేషాలతో పాటు సినిమాలో నటించే వారి గురించి తెలియజేయనున్నారని తెలుస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ తదితర అంశాలపై ఈ సమావేశంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.ఈ మీడియా సమావేశంలో రాజమౌళితో పాటు, మహేష్ బాబు కూడా పాల్గొననున్నారు












Click it and Unblock the Notifications