మహేష్‌బాబు నటన చూసి చేతిలో పుస్తకాన్ని విసిరికొట్టిన రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. అడవిలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఒడిసా రాష్ట్రంలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది చివరలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు తన కెరీర్ లో 29 సినిమాలు చేస్తే రాజమౌళికి అందులో నచ్చిన సినిమా ఒకే ఒక్కటి అంటే ఆశ్చర్యపోతారు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రిన్స్ సినిమాల్లో రాజమౌళికి నచ్చిన సినిమా వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళికి డైలాగులు బాగా నచ్చాయి
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి బిజినెస్ మెన్ చిత్రం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో నన్ను రౌండప్ చేయొద్దు.. రౌండప్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానంటూ రౌడీలకు మహేష్ బాబు వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ మాత్రం రాజమౌళికి తెగ నచ్చేసింది. అంతేకాకుండా ఆ సినిమాలో మహేష్ బాబుది యాంటీ రోల్. నెగెటివ్ పాత్రలో బాగా చేశాడనేది రాజమౌళి అభిప్రాయం. డైలాగులు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి. మహేష్ బాబు క్యారెక్టర్ ఒకటే సినిమాను హిట్ చేసింది. ఇది రాజమౌళిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
పుస్తకాన్ని చించేసిన రాజమౌళి
ఈ సినిమాకు ముందు రాజమౌళి ఒక పుస్తకాన్ని రాశారు. ఒక సినిమాను ఎలా హిట్ చేయాలి? అందుకు ఏమేం చేయాలి? అనే విషయాలమీద ఈ పుస్తకాన్ని రాశారు. అయితే బిజినెస్ మెన్ చిత్రాన్ని చూసిన తర్వాత ఆ పుస్తకాన్ని రాజమౌళి చించేశారు. తాను రాసినదానికి విరుద్ధంగా సినిమా హిట్ అవడంతో సినిమా హిట్ అవడానికి అనేక కారణాలుంటాయనే ఉద్దేశంతో ఆయన ఆ పుస్తకాన్ని చించేసినట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యాంకర్ రాజమౌళి గురించి చెప్పమని అడగ్గా.. ఆయన పైన పేర్కొన్న విషయాలను వివరించారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వకుండా సినిమాలను చేస్తున్నారు. సినిమాను ఎలా హిట్ చేయాలి అనే విషయం ఆయనకు బాగా తెలుసని వర్మ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications