వేల రూపాయలు పెట్టి సలార్ ఫస్ట్ టికెట్ కొన్న స్టార్ దర్శకుడు: లక్కీ హ్యాండ్ సెంటిమెంట్
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్.. మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సినిమా రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లల్లో వంద రూపాయల మేర అదనంగా టికెట్ రేటును పెంచుకోవాలని ప్రతిపాదించింది.

అలాగే- సినిమా విడుదల రోజైన డిసెంబర్ 22వ తేదీన ఆరు ఆటలకు అనుమతి ఇవ్వాలనీ కోరింది. నైజాం ఏరియా వ్యాప్తంగా కూడా సలార్ తొలి షోను తెల్లవారు జామున 4 గంటలకే ప్రదర్శించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అలాగే కొన్ని ప్రధాన స్క్రీన్లపై అర్ధరాత్రి ఒంటిగంటకే షోను ప్రదర్శించడానికి అనుమతులను కోరింది మైత్రీ మూవీస్ సంస్థ.
కాగా ఈ సినిమా టికెట్ల బుకింగ్ మొదలైంది. తొలి టికెట్‌ను స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి కొన్నారు. ఫ్రీగా మాత్రం కాదు. ఏకంగా 10,116 రూపాయలు పెట్టి మరీ టికెట్ కొన్నారాయన. హీరోలు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ సునీల్ ఎర్నేని ఈ టికెట్‌ను ఆయనకు అందజేశారు.

శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో ఈ సినిమాను చూడబోతోన్నారు రాజమౌలి. ఆయనకు కేటాయించిన సీట్ నంబర్ ఏ1. ఆయనతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్, సునీల్ ఎర్నేని కలిసి సినిమా చూసే అవకాశం ఉంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications