ఆస్కార్‌ ఆహ్వానం అందుకున్న రాజ‌మౌళి దంప‌తులు...

టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒక‌రు రాజమౌళి. ఈయ‌న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్య‌క్తి రాజ‌మౌళి. ఈయ‌న తీసిన ప్ర‌తి ఒక్క చిత్రం భారీ విజ‌యాన్ని అందుకున్న‌దే. స్టూడెంట్ నెం 1, విక్ర‌మార్కుడు, య‌మ‌దొంగ‌, ఛ‌త్ర‌ప‌తి, ఈగ‌, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌.. ప్ర‌తి ఒక్క సినిమా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో మ‌దిలో గుర్తుండే ఉంటుంది.

ఇక‌, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డును అందుకున్న ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌కు మ‌రోసారి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆస్కార్ ఆహ్వానాన్ని అందుకున్నారు రాజ‌మౌళి దంపతులు.

Rajamouli s couple received Oscar invite

ఆస్కార్స్ అకాడమీలో మెంబర్​గా ఉండేందుకు రాజమౌళికి ఆహ్వనం అందింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(AMPAS) లో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల నుంచి 487 మందికి ఈ ఆహ్వానం అంద‌గా, వారిలో రాజ‌మౌళితో పాటు ఆయ‌న భార్య ర‌మా రాజ‌మౌళికి కూడా ఆహ్వానం అందింది. ప్ర‌స్తుతం ఈ విషయం కాస్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతుంది. SS రాజమౌళి, రమా రాజమౌళితో పాటు..ఇతర ప్రముఖ భారతీయుల‌కు కూడా ఆహ్వానం అందింది.

అందులో షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్, రీమా దాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. ఇక‌, గ‌తేడాది రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులు కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)లోకి ప్రవేశించిన సంగ‌తి తెలిసిందే.

దర్శకుల విభాగంలో ఎస్ ఎస్ రాజమౌళికి ఈ అరుదైన గౌర‌వం ల‌భించగా, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కింది. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు వీరంతా అర్హత పొందారు. ఈ అరుదైన గౌర‌వాన్ని అందుకున్న రాజమౌళి దంపతులకు అభిమానులు అభినందనలు తెలియ‌జేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+