ఒకప్పుడు 41 మంది హీరోయిన్స్‌ని పరిచయం చేసిన తోపు హీరో.. కానీ !!

ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు... థియేటర్ల ముందు క్యూ లైన్లు కనిపించేవి. పోస్టర్లు కనిపిస్తే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం-"ఇది మినిమమ్ గ్యారెంటీ హిట్!". తెలుగు తెరపై కామెడీకి కొత్త అర్థం చెప్పి ఒకే సమయంలో నవ్వించడమూ, ఆలోచింపజేయడమూ చేయగల అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క డైలాగ్‌తోనే థియేటర్‌ను నవ్వులతో నింపగల సామర్థ్యం ఆయనదే. ఇప్పుడు అదే నటుడు సహాయక పాత్రల్లో మెప్పిస్తూ, తండ్రి-మామ పాత్రల్లో ప్రేక్షకులను కదిలిస్తున్నాడు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకూ

ఆ నటుడు మరెవరో కాదు... నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సినిమా రంగంలోకి ఆయన అడుగుపెట్టింది హీరోగా కాదు. ముందుగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత చిన్న చిన్న పాత్రలు, ఆపై క్యారెక్టర్ రోల్స్... అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారారు. తన కెరీర్‌లో 200కు పైగా సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో సూపర్ హిట్‌లు ఉన్నాయి. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ చిత్రాలు-ఏ జానర్‌లోనైనా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

rajendra-prasad-wh-introduce-41-new-heoins-to-tollywood-and-interestng-details-about-film-career

41 మంది హీరోయిన్లను పరిచయం..

కామెడీ హీరోగా దాదాపు 21 ఏళ్లు కొనసాగిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో సందేహం అక్కర్లేదు. అప్పట్లో ఆయన సినిమా అంటే నిర్మాతలకు ధైర్యం, డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకం, ప్రేక్షకులకు వినోదం. ఎంతో మంది దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసి, తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన కామెడీ శైలిని అందించారు. ఆయన సినిమాలు కుటుంబంతో కలిసి చూడదగ్గవిగా పేరొందాయి. అలాగే టాలీవుడ్ కు 41మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

అయితే కాలంతో పాటు పాత్రలు మారాయి. ఒకప్పుడు హీరోగా వెలిగిన ఆయన... ఇప్పుడు సహాయక పాత్రల్లోనూ అదే శక్తితో మెరుస్తున్నారు. చిన్న సన్నివేశంలోనూ తన కామెడీ టైమింగ్‌తో థియేటర్‌లో నవ్వులు పూయించడం ఇప్పటికీ ఆయన ప్రత్యేకతే.

పద్మశ్రీ గౌరవం..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఆయన సినీ ప్రయాణానికి మరో గొప్ప గుర్తింపు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన కళాకారుడికి ఇది సరైన గౌరవంగా భావిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాలను మూటగట్టుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+