ఒక్క మాటతో జయలలిత ప్రభుత్వాన్ని కూల్చేసిన రజనీకాంత్.. జయలలితతో వివాదం ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాట ఈ పేరు ఓ సంచలనం. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అప్పటి ముత్తు, భాషా, అరుణాచలం నుంచి ఇటీవలి శివాజీ, రోబో, కబాలి, జైలర్ వరకూ ఆయన స్టైలే వేరు. ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన సినిమాలకు భారత్ నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ సినిమా వస్తుందంటే కొన్ని దేశాల్లో పండగ వాతావరణం ఉంటుంది. ఇక తమిళనాడులోనైతే ఆ హంగామా మామూలుగా ఉండదు. తలైవా సినిమా రిలీజ్ రోజున కొన్ని కంపెనీలు సెలవు ప్రకటిస్తాయి కూడా.
ప్రస్తుతం ఆయన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తో కూలీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. మరోవైపు జైలర్ 2 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికీ రజనీ.. కుర్రహీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఒక్క మాటతో ఆయన ఆనాటి జయలలిత ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇది ఆయనకే సాథ్యం.
అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా మాజీ సీఎం జయలలితతో గొడవని బయటపెట్టారు రజనీ. 1995లో చెన్నైలో జరిగిన ఓ ఘటన రజనీకాంత్‌ను బాగా బాధపెట్టిందంట. ఆయన ఈ ఘటనను మర్చిపోలేని రోజులు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని 'బాషా' మూవీ 100 రోజుల సక్సెస్ ఈవెంట్‌లో రజనీకాంత్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని, ఈ ప్రజలను దేవుడు కూడా కాపాడలేడని ఆయన వ్యాఖ్యానించారట. రాష్ట్రంలో బాంబుల మోత మోగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తమిళనాడులో వారసత్వ రాజకీయాల కారణంగా బాంబుల సంస్కృతి బాగా పెరిగిపోయిందని, రాష్ట్రం స్మశానంగా మారిపోయిందంటూ మండిపడ్డారట. ఆయన వ్యాఖ్యలు అప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.

వీరప్పన్ మంచి ఫ్రెండ్..
'బాషా' సినిమా నిర్మాత వీరప్పన్.. రజనీ మంచి స్నేహితులు. వీరప్పన్ నిర్మాతనే కాకుండా జయలలిత క్యాబినెట్ లో మంత్రి కూడా. అయితే బాషా సక్సెస్ మీటింగ్ లో రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే వీరప్పన్ ఖండించలేదట. దీంతో జయలలితకు కోపం వచ్చి.. వీరప్పన్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. అయితే ఇది రజనీకి మరింత కోపం తెప్పించింది. ఆ నెక్స్ట్ ఇయరే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. జయలలితకు ఓటు వేయోద్దని రజనీకాంత్ ప్రచారం చేశారు. దీంతో అన్నాడీఎంకే ఓడిపోయింది.
అయితే ఈ విషయంపై రజనీకాంత్ కొంత కాలానికి రియలైజ్ అయ్యారట. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నారట. రజనీకాంత్ వల్లే తాను ఓడిపోయినా, ఆ తర్వాత ఆయన పెద్ద కుమార్తె పెళ్లికి జయలలిత వెళ్లడం విశేషం. ఈ విషయాన్ని లేటెస్ట్ గా రజనీకాంత్ బయటపెట్టడంతో.. ఆయన కామెంట్స్ మరోసారి తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications