జూనియర్ ఎన్టీఆర్ పై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ నటనను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. సినీ ప్రియులే కాకుండా పరిశ్రమలోని దర్శక నిర్మాతలు, ఇతర హీరోలు.. ఇలా అందరూ తారక్ నటనకు ముగ్ధులవుతారు. ప్రస్తుత తరంలో నవరసాలను పోషించగల నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అంటూ ప్రశంసలు కురిపిస్తారు. తాజాగా ఈ కోవలోకి దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు.

తారక్ 19 సంవత్సరాల వయసులోనే సింహాద్రి సినిమా చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ తాను కొంతమందికి నాయకుడిగా కనిపించే క్యారెక్టర్ చేయాలంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే జరిగిందని, కానీ తారక్ 19 సంవత్సరాలకే చేశాడన్నారు. అంతేకాదని.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడని, ఆ స్టార్ డమ్ ను ఎలా కంటిన్యూ చేస్తాడో తనకు కూడా అర్థం కావడంలేదన్నారు. అప్పటికే కెరీర్ పరంగా తారాస్థాయికి తారక్ వెళ్లిపోయాడు.

rajinikanth comments on junior ntr career

ప్రతి సినిమాను సింహాద్రితోనే ప్రేక్షకులు పోలుస్తారని, దాన్ని పోలుస్తూ సినిమాలు చేయడం ఎన్టీఆర్ కు కత్తిమీద సాములాంటిదని రజనీ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లుగానే కొంతకాలం తారక్ ఎటువంటి సినిమా చేయాలో అర్థంకాక.. చేసిన ప్రతి సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.

మధ్య మధ్య కొన్ని హిట్లు వచ్చినప్పటికీ టెంపర్ సినిమాకు ముందువరకు ఇదే పరిస్థితి ఉండేది. టెంపర్ తర్వాత తానే సొంతంగా, జాగ్రత్తగా కథలు వింటూ, ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లకు కూడా అవకాశాలిస్తూ రావడంతో వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే ఈ సమయంలో తారక్ నుంచి ఇండస్ట్రీ హిట్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయని అభిమానులు కూడా బాధపడుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+