'పెద్ది' లో రజనీకాంత్ మిస్ చేసుకున్న పాత్ర అదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సృష్టిస్తోంది. ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదలైన ఈ మూవీ తొలి రోజే రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం గంటకు 25 వేల టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం 1.57 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. రామ్ చరణ్ కెరీర్‌లోRRR తర్వాత నార్త్ అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రెండో చిత్రంగా పెద్ది నిలిచింది. ఇక పెద్ది చిత్రానికి ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో మరో రెండు వారాలపాటు కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

పెద్ది సినిమాలో పెద్ది క్యారెక్టర్ లో రామ్ చరణ్ జీవించాడని చెప్పొచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా పెద్ది క్యారెక్టర్ ను మరచిపోవడం అంత ఈజీ కాదు. అంతలా ఈ మూవీలో రామ్ చరణ్ నటన ఆకట్టుకుంటుంది. అలాగే అప్పలసూరి పాత్రకు జగపతిబాబు ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఇలా సినిమాలోని దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి టాప్ ఆర్టిస్టులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందుకే పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పెద్ది మూవీలో గౌర్ నాయుడు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ పాత్రకోసం దర్శకుడు బుచ్చిబాబు మొదట శివరాజ్ కుమార్ ను కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ ను అనుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే రజనీకాంత్ ఈ పాత్రలో కొన్ని మార్పులు చేయాలని సూచించారట. ఆ మార్పులు బుచ్చిబాబు చేసినప్పటికీ రజనీకాంత్ సంతృప్తి చెందక గౌర్ నాయుడు క్యారెక్టర్ ను వదులుకున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth Missed This Powerful Role in Peddi Buzz Around RamCharan Film Goes Viral Rajinikanth

ఒకవేళ ఈ మూవీలో రజనీకాంత్ నటించి ఉంటే ఓ రేంజ్ లో ఉండేదని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తమిళనాడులో రికార్డ్స్ క్రియేట్ అయ్యేవని చెప్పుకుంటున్నారు. అలాగే గౌర్ నాయుడు పాత్ర కోసం విజయ్ సేతుపతిని కూడా బుచ్చిబాబు సంప్రదించారట. కానీ తనకు ఆ పాత్ర సరిపోదని రిజెక్ట్ చేసినట్లు స్వయంగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్య్వూలో చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+