Jailer 2 Censor Review: రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ లోడింగ్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2' ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి యూ/ఏ 16 ప్లస్ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అంటే 16 ఏళ్ల పైబడిన వారు ఈ సినిమాను చూసేందుకు అర్హులని స్పష్టం చేసింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ కూడా బయటకు వచ్చింది. జైలర్ 2 రన్ టైమ్ 165 నిమిషాలు ఉన్నట్టు సర్టిఫికేషన్ వివరాల్లో నమోదైంది. అంటే 2 గంటల 45 నిమిషాలు అన్నమాట. అయితే ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాలు దాదాపు 3 గంటలకు పైగా రన్ టైమ్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ రన్ టైమ్ పెద్దగా ఆశ్చర్యం కలిగించేంత అంశం కాదని తెలుస్తోంది. ఇక 2023 లో వచ్చిన జైలర్ తొలి పార్ట్ మూవీ రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలు ఉంది. అయితే దాంతో పోల్చితే ఈ మూవీ కేవలం 3 నిమిషాలే తక్కువగా ఉంది.
ఇక 2023 లో వచ్చిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఈ మూవీపై రిలీజ్ కు ముందే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో నట విశ్వరూపం చూపించనున్నారు. ఇక సెన్సార్ బృందం రివ్యూ ప్రకారం తొలి పార్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే జైలర్ 2 చిత్రం స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో కంటే ఈ పార్ట్ లో మరిన్ని కొత్త షేడ్స్ ఉన్న పాత్రలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, సూరజ్ వెంజారమూడు తమ విలక్షణమైన నటనతో పార్ట్ 2 ను మరోస్థాయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జైలర్ పార్ట్ 1 ప్రధానంగా స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. విగ్రహాల స్మగ్లింగ్ చేసే ఓ క్రూరమైన అండర్ వరల్డ్ మాఫియా చూట్టూ స్టోరీ ఉంటుంది.

అయితే జైలర్ 2 లో ఈ అండర్ వరల్డ్ ను మరింత విస్తరించి అత్యంత క్రూరమైన క్యారెక్టర్స్ ను దర్శకుడు నెల్సన్ పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఓ శక్తివంతమైన అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు కూడా ఆకట్టుకోనున్నాయి. మొత్తానికి జైలర్ 2 మూవీ కంప్లీట్ హై ఆక్టేన్ యాక్షన్ ప్యాకేజీ అని తెలుస్తోంది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా ఈ మూవీని ఎక్కడా ల్యాగ్ లేకుండా నెల్సన్ తీర్చిదిద్దినట్లు సమాచారం.
ఇక చివరలో జైలర్ 3 టైటిల్ కార్డ్ ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఈ నేర సామ్రాజ్యం ఇంకా పూర్తి కాలేదని దర్శకుడు హింట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక జైలర్ 2 మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టినట్లు సమాచారం. ఇక ఫుల్ రివ్యూ కోసం అక్టోబర్ 15 వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications
