'వేట్టయన్' యూఎస్ రివ్యూ... రజనీకాంత్ బ్లాక్‌బస్టర్?
తమిళనాడు అనే కాకుండా తెలుగు, కన్నడం, మళయాళంతోపాటు హిందీలో కూడా సూపర్ స్టార్ క్రేజ్ రజనీకాంత్ సొంతం. తనగురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. 73 సంవత్సరాల వయసులో కూడా సినిమాల్లో డూప్ లేకుండా నటిస్తున్నారు. జైలర్ తో సినీ పరిశ్రమలో తన సత్తా ఏమిటో చాటిన రజనీ వేట్టయన్ సినిమాతో ముందుకు వస్తున్నారు. దీనికి జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలాగే అనిరుధ్ రవిచందర్ కూడా తన మ్యాజిక్ తో మ్యూజిక్ ఇచ్చి సినిమాను మరో మెట్టు ఎక్కించాడా? లేదా? అనేది యూఎస్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
దర్శకుడిపై యూఎస్ ప్రేక్షకుల ప్రశంసలు
సాంకేతికతను ఉపయోగించుకొని హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడమే సినిమా కథ. అతన్ని రజనీకాంత్ ఎలా పట్టుకున్నాడనేదే సినిమా. దర్శకుడు జ్ఞానవేల్ మంచి స్క్రిప్ట్ రాసుకోవడంతోపాటు స్క్రీన్ ప్లే బాగుందని, చాలా కొత్తగా ఉందని అమెరికా ప్రేక్షకులు అంటున్నారు. రజనీకాంత్ లాంటి స్టార్ తో దర్శకుడు చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు. ఈ సినిమాను థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు ఎక్కడా తడబడలేదు. ఆయనపై అమెరికా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భావోద్వేగాలను కూడా బాగా చూపించాడంటున్నారు. అలాగే రజనీకాంత్ ను అద్భుతంగా చూపించారని టాక్.

ఇండియాలో ప్రేక్షకులు ఏమంటారో చూడాలి
ప్రేక్షకుల చేత రజనీ విజిల్స్ వేయిస్తారని, అమితాబ్ పాత్ర చిన్నదే అయినా సినిమాకు కీలకమని, రానా, మంజు వారియర్, ఫాహద్ ఫజిల్, రితిక సింగ్ లాంటివారు మంచి నటనను కనపరిచారంటున్నారు. వారంతా రజనీకాంత్ తో పోటీపడి నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ చేశారని, తనవంతు బాగా కృషిచేశాడు. సంగీతం కోసం అతను వాడిన పరికరాలు శభాష్ అనిపించేలా ఉన్నాయి. విజువల్స్ బాగున్నాయి. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మరో విజయాన్ని సాధించారని, జైలర్ తర్వాత మరో భారీ హిట్ కొట్టాడంటున్నారు. భారతదేశంలో ఎలా ఉంటుందనేది తెలియాలంటే ఇక్కడ విడుదలయ్యేవరకు చూడాలి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోరు కొట్టించాయని, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగోలేదని అమెరికా ప్రేక్షకులు చెబుతున్నారు. మిగతావన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయంటున్నారు.












Click it and Unblock the Notifications