'కల్కి'పై రజినీకాంత్ షాకింగ్ రివ్యూ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‌కు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు.సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారనే చెప్పాలి.

ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు. తాజాగా కల్కి సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రివ్యూను ఇచ్చారు. మూవీపై రజినీ స్పందిస్తూ..కల్కి మూవీ చూశాను. వావ్ అద్భుతమైన సినిమా.
Watched Kalki. WOW! What an epic movie! Director @nagashwin7 has taken Indian Cinema to a different level. Hearty congratulations to my dear friend @AswiniDutt @SrBachchan @PrabhasRaju @ikamalhaasan @deepikapadukone and the team of #Kalki2898AD. Eagerly awaiting Part2.God Bless.
— Rajinikanth (@rajinikanth) June 29, 2024
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. నా ఫ్రెండ్ అశ్విని దత్ , అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే మిగిలిన టీమ్ అందరికీ నా అభినందనలు. పార్ట్ 2 కోసం ఆత్రుతగా చూస్తున్నాను అంటూ పోస్టు పెట్టారు. రజినీకాంత్ చేసిన పోస్ట్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ..మాటల్లేవు సార్.. మా టీమ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటూ రిప్లై ఇచ్చారు.












Click it and Unblock the Notifications