సమంత ప్రియుడు భార్య సంచలన పోస్ట్..? భలే సెటైర్ వేసిందిగా..!
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో ఆగస్టు 8న నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.

ఇదే సమయంలో సమంత రెండో పెళ్లి గురించి అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది.

త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ సినిమాకు సైతం రాజు నిడుమోరునే దర్శకత్వం వహించారు. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ జంట కలిసి దర్శనం ఇస్తున్నారు. సమంత తిరుమలకు వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటువంటి సమయంలోనే రాజు నిడుమోరు భార్య శ్యామల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
నా కోసం ఆలోచించేవారు, వినేవారు, వినిపించేవారు, మాట్లాడేవారు, మాట్లాడించేవారు, చదివేవారు, రాసేవారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా ఆశీర్వాదాలు పంపుతూనే ఉంటా' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారనేది తెలియడం లేదు. సమంత- రాజ్ రిలేషన్ షిప్ గురించే శ్యామల ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటు సమంత లేదా రాజ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications