రకుల్‌కు షాక్..పెళ్లైన రెండు నెలలకే టార్చర్ పెడుతున్న భర్త

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లైన రెండు నెలలకే రకుల్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది.

Rakul husband is torturing after two months of marriage

ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు.

గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే తాజాగా రకుల్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త రకుల్‌ను టార్చర్ చేస్తున్నాడంట. ఓ బోల్డ్ సిరీస్‌లో నటించమని బలవతం చేస్తున్నాడనే వార్త వైరల్‌ అవుతోంది. ఇక ఇది విన్న అభిమానులు షాక్ అవుతున్నారు, పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా ఉండమని చెబుతారు కానీ రకుల్ భర్త ఏంటీ డిఫరెంట్‌గా ఉన్నాడు.

అంతే కాకుండా పెళ్లి తర్వాత చాలా మంచి పాత్రలు చూస్ చేసుకోవాలని చెబుతారు. కానీ జాకి భగ్రాని చాలా డిఫరెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన రకుల్ కెరీర్ ఆగిపోకూడదు, ఎదగాలనే ఉద్దేశంతో అలా చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి ఫేమ్ రావాలంటే ఎలా ఉండాలి అనేది తెలుసు. అందుకే అలా చేయమని చెప్తున్నాడంటున్నారు కొందరు.అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ..ప్రస్తుతం దీనికి సంబంధించిన రూమర్ మాత్రం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+