పెళ్లైన రెండు నెలలకే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ ..ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో హల్ చల్ చేయడం తప్పిస్తే.. వెండితెర మీద రకుల్ కనిపించి రెండేళ్లకు పైగానే కావొస్తోంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో రకుల్ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది.

రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. వివాహం అనంతరం రకుల్ తక్కువగా బయట కనిపించింది. జిమ్‌కు వెళ్లిన సందర్భంలో తప్పిస్తే... రకుల్ బయటకు వచ్చింది లేదు. కొత్తగా పెళ్లి కావడంతో ఇంటికే పరిమితం అయింది.
తాజా రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రకుల్ ఆమె మెడలో తాళి బొట్టు కనిపించలేదు. నుదిటిన బొట్టు కూడా లేకుండా దర్శనమిస్తుంది. దీంతో నెటిజన్లు రకుల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.పెళ్లై రెండు నెలలు కాకముందే అప్పుడే తాళి తీసేశావా.. నీ మెడకు తాళి బొట్టే భారమైందా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరీ తనపై వస్తున్న విమర్శలకు రకుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications