రకుల్ సంచలన నిర్ణయం.. పెళ్లైన రెండు నెలలకే...!
రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లైన రెండు నెలలకే రకుల్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది.

ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు.
గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఆమె తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందట. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని రకుల్ భావిస్తోంది. హీరో నాగార్జునతో కలిసి కొత్త బిజినెస్‌ను మొదలుపెట్టడానికి రకుల్ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే రకుల్‌కు హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్ సెంటర్ ఉంది. దీంతో పాటు మరో వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. అయితే రకుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా పెళ్లైంది కదా లైఫ్‌ను ఎంజాయ్ చేయకుండా అప్పుడే బిజినెస్ గోల ఏంటని రకుల్‌పై వారు మండిపడుతున్నారు. పెళ్లైన రెండు నెలలకే భర్తను బకరా చేశావా అంటూ మరికొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు, మొత్తానికి రకుల్ బిజినెస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications