స్టేజ్‌పై జారిపోయిన రకుల్ డ్రెస్.. అసిస్టెంట్ లేకపోతే అంతే సంగతి..!
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ క్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుక పడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా ఫలితం లేకుండా పోయింది. రకుల్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. ఇటీవల 'భారతీయుడు 2' తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది.

రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు గతేడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. గతంలో వరుస సినిమాలతో హల్ చల్ చేసిన రకుల్ , ఇప్పుడు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.రకుల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడం విశేషం. తాజాగా అమ్మడు ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'దే దే ప్యార్ దే 2' సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.ఈ ఈవెంట్‌లో హీరోయిన్ రకుల్ సైతం పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో అజయ్ దేవగన్‌తో కలిసి పలు ఈవెంట్లలో పాల్గొన్న రకుల్... ఇటీవల ఒక ఈవెంట్‌లో ధరించిన ఎర్రటి డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఈవెంట్‌లో రకుల్ ధరించిన రెడ్ ఔట్‌ఫిట్ స్టైలిష్‌గా ఉన్నప్పటికీ, అది చాలా కిందికి జారినట్టుగా ఉండటం చర్చకు దారితీసింది. అయితే, ఈ చర్చలకు బలం చేకూర్చే మరో సంఘటన కూడా ఆ ఈవెంట్‌లోనే జరిగింది. రకుల్ ధరించిన డ్రెస్ అతిగా కిందికి ఉండటాన్ని గమనించిన ఆమె పర్సనల్ అసిస్టెంట్.. నటి వద్దకు వచ్చి, పబ్లిక్ దృష్టిలో పడకుండా డ్రెస్‌ను సర్దుకోమని సైగ చేసింది.
పబ్లిక్‌లో జారిపోయిన రకుల్ డ్రెస్..పరువు కాపాడిన అసిస్టెంట్#RakulPreetSingh #RakulPreet #AjayDevgn #ReelTalk #Oneindia #OITelugu pic.twitter.com/Lhq0uJaASS
— oneindiatelugu (@oneindiatelugu) October 16, 2025
వెంటనే అప్రమత్తమైన రకుల్ ప్రీత్ సింగ్, తన డ్రెస్‌ను సరి చేసుకున్నారు. ఈ దృశ్యం మీడియా కెమెరాలకు చిక్కడంతో, ప్రమోషన్స్ సందర్భంగా రకుల్ ధరించిన దుస్తులు మరియు ఆమె అసిస్టెంట్ హెచ్చరిక వ్యవహారం బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పబ్లిక్ ఈవెంట్‌లో నటి అలా కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ డ్రెస్సుపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రకుల్ ఎందుకు ఇంతగా అన్నీ కనిపించేటట్టు డ్రెస్ వేసుకుంది?, సినిమా ప్రమోషన్స్‌కు మరి ఇంతలా డ్రెస్ వేసుకోవడం అవసరమా? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు హైప్ పెంచే ప్రయత్నంలో భాగంగానే రకుల్ ఇటువంటి స్టైలింగ్‌ను ఎంచుకున్నారా, లేక ఇది కేవలం స్టైలింగ్ తప్పిదమా అనే చర్చ అభిమానుల మధ్య నడుస్తోంది. ఏది ఏమైనా, 'దే దే ప్యార్ దే 2' సినిమా కంటే కూడా రకుల్ డ్రెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పడిందనేది వాస్తవం.
-
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications