'ఎంఎస్ ధోని'ని అలా వదులుకోవాల్సి వచ్చింది - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు.
దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా నా లైఫ్‌లో ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నానని తెలిపింది. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాలో అవకాశం వచ్చిన దాన్ని వదులుకున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. సినిమాలో ముందుగా నన్ను ఎంపిక చేసుకున్నారు దర్శక, నిర్మాతలు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయాను.
దీనికి సంబంధించిన రీడింగ్ పలు పనులన్ని కూడా కంప్లీట్ చేశారు. కానీ నేను అప్పుడే రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ సినిమాలో నటిస్తున్నాను. రెండు సాంగ్స్ ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎంఎస్ ధోని చిత్రం నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో మంచి సినిమా చేజారిపోయిందని చాలా బాధపడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్ సింగ్, దిశా పటానీ, కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ












Click it and Unblock the Notifications