Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాలెంటైన్స్ డే పై ఉపాసన షాకింగ్ పోస్ట్.. వాళ్లకు కాదు అంటూ..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె అపోలో ఆస్పిటల్స్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సేవా కార్యాల్లో పాల్గొంటూ గొప్ప మనసు చాటుకుంటున్నారు ఈ మెగా కోడలు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టి అందరినోటా నవ్వులు పూయించారు.

" ఈ ప్రేమికులరోజు అందరికీ కాదు. ఈ వాలెంటైన్స్ డే 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించింది మాత్రమే. మీరు అంతకంటే ఎక్కువ వయసున్న వారైతే.. మీరు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం వేచి చూడండి" అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై సామాజిక మాధ్యమాల్లో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.

Ram Charan and Upasana s Heartfelt Valentine s Day Post Goes Viral

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ వీరి మధ్య ఒక్క రూమర్ కూడా బయటకు రాకపోవడం వీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో అర్థం అవుతోంది. చెర్రీ- ఉపాసన వివాహం జూన్, 2012లో జరిగింది. వీరిద్దరికీ వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత పండంటి పాప పుట్టింది. ఆమెకు క్లింకార అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+