రామ్ చరణ్ బాడీగార్డ్ ఆ మజాకా.. గద్దలా ఎత్తుకుపోయాడుగా.. వీడియో వైరల్ !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి జాన్వీ కపూర్ విజయవాడలో జరిగిన ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ ఓ అభిమాని భద్రతను ఛేదించి రామ్ చరణ్ వద్దకు దూసుకొచ్చాడు. రామ్ చరణ్‌లాగే కనిపించే హెయిర్‌స్టైల్‌తో ఉన్న ఆ అభిమాని వారి దగ్గరగా వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన రామ్ చరణ్ వ్యక్తిగత బాడీగార్డ్, MMA ఫైటర్ కెవిన్ కుంట అతన్ని పక్కకు లాగారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.

ram-charan-body-guard-again-in-lime-light-for-jumps-in-while-fan-comes-too-close-to-meet-the-actor

ఎవరీ కెవిన్ కుంటా? గ్లోబల్ స్టార్ పక్కన ఇంటర్నేషనల్ ఫైటర్

సాధారణంగా బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలకు లోకల్ బాడీగార్డ్స్ రక్షణగా ఉంటారు. కానీ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ రేంజ్‌కు వెళ్లడంతో, ఆయన భద్రతా ప్రమాణాలు కూడా అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చరణ్ అడుగుపెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉంటూ, సిక్స్‌ప్యాక్ బాడీతో, భారీ కటౌట్‌తో ఒక హాలీవుడ్ విలన్ రేంజ్‌లో కనిపించిన ఆ వ్యక్తి పేరు కెవిన్ కుంటా. అతను కేవలం ఒక సాధారణ బాడీగార్డ్ మాత్రమే కాదు, ఆయనో అంతర్జాతీయ క్రీడాకారుడు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో స్థిరపడ్డారు. అక్కడ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా రాణిస్తూ, "ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్"గా రికార్డు సృష్టించారు. రింగ్ లో ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ ఇంటర్నేషనల్ బాక్సర్, ఇప్పుడు రామ్ చరణ్‌కు పర్సనల్ సెక్యూరిటీగా మారడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రోజుకు రూ. 2 లక్షలు? ఇండియన్ హిస్టరీలోనే రికార్డు

కెవిన్ కుంటాకు భద్రతా ఫీజుగా రామ్ చరణ్ రోజుకు దాదాపు రూ. 2 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు టాక్. ఈ లెక్కన చూసుకుంటే భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే బాలీవుడ్ బాడీగార్డ్స్ (సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా, షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్) రికార్డులను కూడా కెవిన్ దాటేసినట్లేనని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+