'గేమ్‌ఛేంజర్' ఫస్ట్ రివ్యూ
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని నిర్మించారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో నటించినప్పటికీ సోలో హీరోగా వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. తమన్ సంగీతాన్ని అందించాడు. సోషల్ మీడియాలో ఈ చిత్ర యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందిందంటూ సినిమా రివ్యూ ఒకటి వైరల్ అవుతోంది. దాని ప్రకారం...
రెండోభాగాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనేదానిపై..
సినిమా మొదటి భాగంలో రామ్ చరణ్ పరిచయం, అతని కాలేజీ రోజులను చూపిస్తాడు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే కథ సాధారణంగా నడుస్తూ వెళుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులకు బాగా ఆసక్తి పెరుగుతుంది. అప్పటివరకు ఈ మొదటి భాగం యావరేజ్ మీద కొంచెం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయి రెండో భాగం మొదలైన తర్వాత మాత్రం సినిమా అదిరిపోయింది. సినిమా గేమ్ మొత్తం మారిపోతుంది. అప్పన్న పాత్ర రంగప్రవేశం చేయడంతోపాటు అతని సన్నివేశాలన్నీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. రెండో భాగంలో సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేదానిపై ఈ సినిమా విజయం ఆధారపడివుంటుంది.

రామ్ చరణ్ నటన సూపర్
రామ్ చరణ్ నటన అదిరిపోతుందని, అతనికి మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. రాజకీయ పరమైన అంశాలను దర్శకుడు శంకర్ బాగా తీశాడని, వాటికి కూడా మంచి పేరు వస్తుందంటున్నారు. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ కూడా రామ్ చరణ్ నటన అదిరిపోయిందని, అతనికి జాతీయ అవార్డు వస్తుందని చెప్పారు. చిత్ర యూనిట్ కూడా అదే చెబుతోంది. అమెరికాలో ఈ సినిమా ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. తర్వాత ఏపీలోని రాజమండ్రి, లేదంటే విజయవాడలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. నాయక్ సినిమా ఆడియో విడుదలకు పవన్ హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం విజయోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు హాజరైతే మూడోసారి అవుతుంది. ఈ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది.












Click it and Unblock the Notifications