ఇక్కడ అట్టర్ ఫ్లాప్ కానీ అక్కడ మాత్రం రికార్డులు బ్రేక్.. రామ్ చరణ్ మూవీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. రీసెంట్ గానే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 'గేమ్ చేంజర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న అ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. భారీ సెటప్‌తో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పరమరొటీన్ మాత్రమే కాకుండా వాస్తవ దూరంగా అనిపిస్తుంది.
ఏదో అద్భుతాన్ని ఆశించి వెళ్తే నిరాశతో బయటికి రావాల్సి వచ్చింది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో మైనింగ్‌పై అప్పన్న పోరాటం.. పొలిటికల్ ఎంట్రీ మెప్పించాయి.
సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్స్ చేశారు. డైరెక్టర్ శంకర్ ని ప్రతీ ఒక్కరు తిట్టుకున్నారు. అలానే ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగు ఆడియన్స్ సినిమాని తిట్టిపోస్తుంటే.. హిందీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
400 మిలియన్ వ్యూస్..

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో భారీగానే లాస్ అయ్యారని టాక్ నడుస్తోంది. అయితే హిందీ వెర్షన్ ఓటీటీ రైట్స్ ని దిల్ రాజు జీ తెలుగు ఛానల్ కి అమ్మగా.. మార్చి 7 నుంచి 'జీ5' యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. సుమారుగా ఆరు వారాల నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ ఇప్పటికీ కూడా టాప్ లోనే నిలుస్తుంది ఈ మూవీ. దీంతో హిందీలో రామ్ చరణ్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 400 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయని.. ఇది ఒక సెన్సేషనల్ రికార్డు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు. ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది.












Click it and Unblock the Notifications