అల్లు అర్జున్ ను చూస్తే రామ్ చరణ్ కు అసూయ!
తెలుగు సినీ పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ రోజురోజుకు తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. వాస్తవానికి ఇది ఇప్పటికే పూర్తయి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ శంకర్ భారతీయుడు2 చిత్రంలో బిజీగా ఉండటంతో ఇది వాయిదా పడింది. ప్రస్తుతం పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పుడు విడుదల చేస్తారో దర్శకుడికే తెలియాలి.
ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వార్త పాపులర్ గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. విదేశాల్లో కూడా క్రేజ్ వస్తోంది. ఓ విషయంలో అల్లు అర్జున్ ను చూస్తే రామ్ చరణ్ కు ఎంతో ఈర్ష్యగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోడు. లైట్ తీసుకుంటాడు. ఎవరైనా తనను తిట్టినా పట్టించుకోడు. అయితే మిగతా హీరోలకు మాత్రం అలా ఉండటం కుదరడంలేదు.
అంత పాజిటివ్ తో ఆలోచించేవారు అరుదుగా ఉంటారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ లో గమనించిన రామ్ చరణ్ కు తాను కూడా అలా ఉండాలనుకుంటారంట. అంత లైట్ గా, పాజిటివ్ గా ఉండటం చూసి ఎంతో ఈర్ష్యగా ఉంటుందంట.

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది నిన్ననే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. మైత్రీమూవీస్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారు.












Click it and Unblock the Notifications