ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదేమో: రామ్‌చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో చెర్రీ ద్విపాత్రాభినయం చేశారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈనెల 10వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. దానికి ముందురోజు 9వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు వేయనున్నారు. టికెట్ ధరల పెంపు ఏపీలో ఉండగా, తెలంగాణలో ఇవ్వలేదు. కియారా అద్వానీ, శ్రీకాంత్, జయరాం, ఎస్ జే సూర్య, అంజలి తదితరలు నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. శంకర్ మొదటిసారి తెలుగులో నేరుగా చేసిన చిత్రం ఇది.

ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుందన్న రామ్ చరణ్
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ను బాలయ్య ఓ ప్రశ్న అడుగుతాడు. నీ కెరీర్ లో ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భం, సినిమా ఏదైనా ఉందా? అని. దానికి చెర్రీ బదులిస్తూ హిందీలో చేసిన జంజీర్ సినిమాను అనవసరంగా చేశానని, అది చేయకుండా ఉంటే బాగుండేదనిపించిందని చెప్పాడు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశానని, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమానే రీమేక్ చేయడం తప్పని, ఇప్పటికీ ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదనిపిస్తుందన్నారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Ram Charan still feels it would have been better if he hadn t made Zanjeer hindi movie

బాలీవుడ్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు
జంజీర్ కు అపూర్వ లఖియా దర్శకత్వం వహించగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై బాలీవుడ్ లో రామ్ చరణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. హీరోయిన్ ప్రియాంకచోప్రా కూడా తీవ్రంగా విమర్శించింది. రామ్ చరణ్ అనుకున్న సమయానికి షూటింగ్ కు వచ్చేవాడు కాదని, దీనివల్ల తాను ఒప్పుకున్న ఇతర సినిమాలపై ప్రభావం పడేదని చెప్పింది. అలాగే బాలీవుడ్ విమర్శకులు కూడా రామ్ చరణ్ నటనపై విమర్శలు గుప్పించారు. షూటింగ్ కు ఆలస్యంగా రావడంతోపాటు సినిమా ప్రమోషనల్ వేడుకకు కూడా ఆలస్యంగానే వచ్చేవాడని, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాక, ఒప్పుకున్న ఇతర సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డానని ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ ను ప్రియాంక చోప్రా బాలీవుడ్ హీరోతో పోల్చి పొగడ్తలతో ముంచెత్తింది. అప్పటికీ, ఇప్పటికీ రామ్ చరణ్ వ్యవహారశైలిలో తేడా రావడమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+