ఎంతో నరకం అనుభవించాను..మెగా కోడలు సంచలన పోస్ట్

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే.

పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు.

Ram Charan-Upasana s Special Bond amp amp Upasana s Inspiring Khas Post

దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాసన తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన 'ఖాస్ ఆద్మీ పార్టీ' గురించి ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.

'ఖాస్ ఆద్మీ పార్టీ' గురించి చెబుతూ.."సంపద, హోదా, కీర్తి, ఒకరి పట్ల చూపించే దయ" అనేవి ఆ వ్యక్తిని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయని ఆమె వివరించారు.ఈ సమాజంలో ప్రజల అంతర్గత లక్షణాల కంటే, బాహ్య విషయాలైన పేరు ప్రఖ్యాతులు, హోదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను ఈ సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడ్డాను అని ఆమె తెలిపారు. నా కుటుంబం నుంచి వచ్చిన వ్యాపార వారసత్వం , రామ్ చరణ్‌ను వివాహం చేసుకోవడం వల్ల ఈ పరిణితి రాలేదని ఉపాసన స్పష్టం చేశారు.

ఎంతో ఒత్తిడి, బాధలను అనుభవించాను. ఎన్నో సార్లు కింద పడినా, మళ్ళీ లేచి నిలబడ్డాను.తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను.కొన్నిసార్లు తనను తాను అవమానించుకొని, తన లోపాలను సరిదిద్దుకున్నానని మెగా కోడలు చెప్పుకొచ్చారు.

తన జీవిత ప్రయాణాన్ని నిజాయితీగా పంచుకున్న ఉపాసన, తన బలాన్ని తిరిగి పొందడానికి తనకు ఒక రీసెట్ అవసరమైందని ఆమె తెలిపారు.ఈ పోస్ట్ వల్ల తన జీవితం, కుటుంబం, విలువల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయగలిగానని ఉపాసన చెప్పారు ఈ సందేశం ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+