విడాకుల గురించి ముందే హింట్ ఇచ్చిన రామ్ చరణ్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం, అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో విడాకులు బాట పడుతున్నారు.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా నటాషా - హార్దిక్ పాండ్యలు సైతం విడాకులు తీసుకున్నారు.

అయితే విడాకుల గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలోనే చెప్పారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ' ఆరెంజ్ ' సినిమాలో ప్రేమ ఎక్కువ రోజులు ఉండదనే విషయాన్ని రామ్ చరణ్ అప్పుడే చెప్పారని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
లవ్ కొంత కాలమే బాగుంటుందని చరణ్ ఎప్పుడో చెప్పాడని.. ఈ సెలబ్రిటీల విడాకులు అందుకే జరుగుతున్నాయని ట్రెండ్ చేస్తున్నారు. లవ్ కొంతకాలం మాత్రమే బాగుంటుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications