రామ్ చరణ్ కూడా అలాంటి వ్యక్తే... ఉపాసన పోస్ట్ వైరల్
తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే.
పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు.

దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా కోడలు ఉపాసన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవ్ పేజ్‌పై రామ్ చరణ్- ఉపాసన దంపతుల ఫొటో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా దీనిపై ఉపాసన స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని నాకు తెలియదు. కానీ ప్రతి మహిళ విజయం వెనుక మాత్రం కచ్చింతంగా సపోర్ట్ చేసే వ్యక్తి ఉంటాడని..ఆ వ్యక్తి తన జీవితంలో దొరికాడంటూ ఉపాసన తన భర్త రామ్ చరణ్ గొప్పతనం గురించి వివరించింది. ఉపాసన సింప్లిసిటీ చూసిన మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications