తెగించిన రామ్ చరణ్..!!
Ram Charan: టాలీవుడ్‌లో సినిమాల సందడి మొదలైంది. ఈ శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విష్వక్‌సేన్, నేహా షెట్టి జంటగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ్ గం గం గణేశా, కార్తికేయ భజే వాయు వేగం విడుదల అయ్యాయి. మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
వచ్చే శుక్రవారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే- మనమే. శర్వానంద్, కీర్తి షెట్టి, సీరత్ కపూర్ నటించిన మూవీ ఇది. శ్రీరామ్ ఆదత్య దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో ఓ విక్రమ్ ఆదిత్య అనే ఓ ప్లేబాయ్ రోల్‌లో కనిపించనున్నాడు శర్వానంద్. అతని చుట్టే కథ తిరుగుతుంది. సరదాగా గడిచిపోతున్న అతని జీవితంలోకి ఓ బాబు ప్రవేశించడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. వారిద్దరి మధ్య హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయని యూనిట్ చెబుతోంది.
కాగా- మనమే సినిమా ట్రైలర్ శనివారం విడుదల కాబోతోంది. ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ అవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేస్తారు రామ్ చరణ్.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఎస్ శంకర్ దర్శకుడు. సుమారు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. దీని తరువాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్నాడు.












Click it and Unblock the Notifications