ఆర్జీవీకి బిగ్ షాక్.. రూ.29.67 కోట్ల లీగల్ నోటీసు.. అక్టోబర్ 30 డెడ్‌లైన్!

వివాదాలకు దగ్గరగా ఉండే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్లాటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయనకు రూ.29.67 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బహిరంగ ప్రకటన జారీ చేసింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్వోసీ) లేకుండా ఆర్జీవీతో ఎలాంటి ఒప్పందాలు, లావాదేవీలు జరపవద్దని చిత్రనిర్మాతలు, పంపిణీదారులు, ప్రసారకర్తలు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఆ సంస్థ తీవ్రంగా హెచ్చరించింది.

'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

2010 ఒప్పందం నుంచి వివాదం
ఎక్లాటెంట్ ఫిల్మ్స్, రామ్ గోపాల్ వర్మ మధ్య ఈ వివాదం ఏప్రిల్ 10, 2010న కుదిరిన ఓ ఒప్పందం నుంచి మొదలైంది. ఏప్రిల్ 17, 2013న బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా ప్రస్తావించింది. అతుల్ మోహన్ 'కంప్లీట్ సినిమా' మ్యాగజైన్ అక్టోబర్ 2026 సంచికలలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. అక్టోబర్ 15న ఆర్జీవీకి లీగల్ నోటీసు పంపారు. అసలు మొత్తంతో పాటు రూ.11,38, 92,000 వడ్డీని కలిపి మొత్తం రూ. 29,67,64,000 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

Ram Gopal Varma Faces Big Shock Rs 29 67 Crore Legal Notice Issued Deadline October 30 Full Details

ఎన్వోసీ లేకపోతే సొంత పూచీకత్తుపైనే!
ఎక్లాటెంట్ ఫిల్మ్స్ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. బకాయి మొత్తం పూర్తిగా చెల్లించే వరకు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి మూడో పక్షంతోనూ ఒప్పందాలు చేసుకోకూడదు. సినిమా నిర్మాణం, సహ-నిర్మాణం, దర్శకత్వం లేదా రచన వంటి ఏ రకమైన ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా సంస్థ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. చిత్రసీమలోని నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, టీవీ ఛానెళ్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎన్వోసీ లేకుండా ఆర్జీవీ ప్రాజెక్టుల హక్కులు పొందితే.. అవి చెల్లుబాటు కావని, అందుకు ఆయా సంస్థలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ లు.. నువ్ మామూలోడివి కాదన్నా..!
ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ లు.. నువ్ మామూలోడివి కాదన్నా..!

అక్టోబర్ 30 గడువు
చెల్లింపుల కోసం ఎక్లాటెంట్ ఫిల్మ్స్ అక్టోబర్ 30, 2026ని తుది గడువుగా నిర్ణయించింది. ఒక నిర్దేశించిన గడువులోగా బకాయిలు చెల్లించకపోతే.. రామ్ గోపాల్ వర్మ రాబోయే సినిమాలు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయం, వాటాలు, ప్రయోజనాలపై చట్టపరమైన తాత్కాలిక హక్కులను అమలు చేస్తామని తెలిపింది. ఇంజక్షన్ ఆర్డర్లు పొందడం సహా తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ బహిరంగ నోటీసు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుండగా.. ఈ వ్యవహారంపై ఆర్జీవీ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా వివరణ వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+